పుష్ప అప్డేట్స్ షురూ…అఫిషియల్ అనౌన్స్మెంట్!

Published on Aug 1, 2021 11:23 pm IST

అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా తరహాలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగస్ట్ నెల లో విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ మరియు విడుదల వాయిదా పడటం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ ఇంకా అధికారికంగా వెలువడలేదు. అయితే తాజాగా పుష్ప చిత్రం సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది.

పులి, మేక లతో ఉన్న ఆ పోస్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పుష్ప చిత్రం ఆగస్ట్ నెలలో విడుదల కావాల్సి ఉంది, అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతోంది అనే దానిపై సైతం ఇంకా క్లారిటీ లేదు. అయితే విడుదల తేదీ తో పాటుగా, పోస్టర్ లేదా మరొక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఇంకా వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :