“గని” సెట్స్ లో “పుష్ప” రాజ్ సందడి.!

Published on Jul 23, 2021 10:00 am IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం “గని” అనే ఒక ఆసక్తికర బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం లాస్ట్ స్టేజ్ ఆఫ్ షూట్ లో ఉండగా ఈ సినిమా సెట్స్ లోకి స్టైలిష్ “పుష్ప” రాజ్ బన్నీ ఎంటర్ అయ్యి సందడి చేసాడు.

ఈ చిత్రానికి బన్నీ సోదరుడు అల్లు బాబీ కూడా ఒకరు కాగా తనతో కలిసి ఓసారి ఈ సినిమా సెట్స్ కి వెళ్లి చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి మరియు ఇతర చిత్ర యూనిట్ తో ముచ్చటించాడు. అలాగే గని సినిమాలో వరుణ్ లుక్ కిల్లింగ్ గా ఉందని ప్రతీ ఒక్కరికీ తన కంగ్రాట్స్ తెలుపుతూ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేసాడు.. ఇక అల్లు అర్జున్ కూడా తన భారీ చిత్రం “పుష్ప” ని మళ్ళీ రీస్టార్ట్ చేయనుండగా. గని చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :