“పుష్ప” అనుకున్న టైంకి రావడం కష్టమేనా?

Published on Sep 28, 2021 8:00 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ సినిమా అనుకున్న టైంకి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదని తెలుస్తుంది. కరోనా పరిస్థితులు, ఇండస్ట్రీలో పలు సమస్యల కారణంగా ఇప్పటికే పలు పెద్ద సినిమాలన్ని విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి.

ఇదిలా ఉంటే ‘పుష్ప’ షూటింగ్‌ ఇటీవల మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్‌ని జరుపుకుంది. అయితే ఇంకా రెండు పాటలు, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు అక్కడే చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఇంతలోనే తెలుగు రాష్ట్రాల్లో ‘గులాబ్‌’ తుపాన్‌ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే పరిస్థితులు ఇలానే కొనసాగితే అక్టోబరు చివరి నాటికి ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేయడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీ గురుంచి ఏమైనా ఆలోచిస్తుందా లేక అనుకున్న సమయానికే విడుదల చేస్తుందా అన్న దానిపై చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా మరోసారి క్లారిటీ రావాల్సిందే.

సంబంధిత సమాచారం :