బన్నీ ‘పుష్ప’కు మరోసారి తగిలిన కరోనా సెగ ?

Published on Dec 2, 2020 11:03 pm IST

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘ఆలా వైకుంఠపురములో’ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడం, ‘రంగస్థలం’ లాంటి భారీ హిట్ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అందరిలోనూ బోలెడంత ఆసక్తి నెలకొంది ఉంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఎన్నో అంచనాలతో చిత్రీకరణకు వెళ్లాలని టీమ్ టెస్ట్ షూట్ కూడ పూర్తిచేయగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆరు నెలలు షూట్ జరగలేదు. లాక్ డౌన్ ఎత్తివేసిన తక్షణమే చిత్రీకరణకు ప్లానింగ్ మొదలుపెట్టారు సుకుమార్. అనేక తర్జనభర్జనలు తర్వాత మారేడుమిల్లి అడవుల్లో షూట్ రీస్టార్ట్ చేశారు. ఆలస్యమైనా కూడ అవుట్ ఫుట్ అనుకున్నట్టే వస్తుండటంతో బన్నీ బృందం ఉత్సాహంగా షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ మరోసారి కరోనా కలకలం మొదలైందట.

చిత్ర బృందంలో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు చెబుతున్నారు. పెద్ద సినిమా కావడంతో ప్రతిరోజూ 200 నుండి 300 వరకు క్రూ మెంబర్స్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అందుకే వైరస్ టాక్ అయిందని, కాబట్టి అనుకున్న తేదీకంటే ముందే షెడ్యూల్ ముగించారని, కరోనా వేవ్ పూర్తిగా తగ్గాక తిరిగి చిత్రీకరణ మొదలుపెడతారని వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందనేది చిత్ర బృందం నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ తెలియదు.

సంబంధిత సమాచారం :

More