ఇక “పుష్ప” టీం లేట్ చెయ్యకూడదా.?

Published on Oct 30, 2020 9:00 am IST

మన టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ ఆల్ టైం ఫేవరెట్ గా నిలుస్తాయి. అలాంటి ఆసక్తికర కాంబోలలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబో ఒకటి. వీరిద్దరి నుంచి వచ్చిన “ఆర్య, ఆర్య 2” చేసిన మ్యాజిక్ ఇప్పటికీ అలానే ఉంది. అయితే ఆ రెండు లవ్ స్టోరీస్ కాగా ఈసారి మాత్రం వాటికి భిన్నంగా ప్లాన్ చేసిన మాస్ ఎంటర్టైనర్ “పుష్ప”. హ్యాట్రిక్ చిత్రంగా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని బన్నీ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చెయ్యడంతో బన్నీ మొట్ట మొదటిసారిగా బాలీవుడ్ మార్కెట్ లోకి కూడా అడుగు పెట్టడం ఖాయం అయ్యింది. అయితే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ ను వీరు అనౌన్స్ చేసి నేటితో ఏడాది పూర్తయ్యిపోయింది. సరిగ్గా ఇదే రోజు ఈ చిత్రానికి ముహూర్తం కుదిర్చి సంవత్సరం పూర్తయినందున బన్నీ అభిమానులు ఆరోజులను గుర్తు చేసుకుంటున్నారు. కానీ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఈ పాటికే ఎంతో షూట్ ను పూర్తి చేసుకోవాల్సిన ఈ చిత్రం ఆగాల్సి వస్తుంది.

బన్నీ చేస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో అంతా ప్రతిష్ఠాత్మకంగానే తీసుకొన్నారు. అందుకే రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలాగో బన్నీకు ఎంతో అచ్చొచ్చిన విశాఖ నుంచే షూట్ ను మొదలు పెట్టనున్నారు కాబట్టి ఇక నుంచి స్పీడ్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ పూర్తి చేసేయాలని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే ఏడాది పూర్తయ్యిపోయింది. పైగా ఇంకో రెండు నెలలు అయ్యిపోతే అల వైకుంఠపురములో వచ్చి కూడా ఏడాది అయ్యిపోతుంది. మరి పుష్ప టీం ఎంత త్వరగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More