‘గల్లీ రౌడీ’ నుంచి రేపు మరో వీడియో సాంగ్ వచ్చేస్తుంది..!

Published on Sep 28, 2021 12:12 am IST


యంగ్ హీరో సందీప్‌ కిషన్, నేహా శెట్టి హీరోయిన్‌గా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గల్లీ రౌడీ’ సినిమా సెప్టెంబర్ 17న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ని దక్కించుకుంది. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. అయితే రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి “పుట్టెనే ప్రేమ” ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్, స్నేహ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :