‘యాత్ర డైరెక్టర్’ యాక్షన్ డ్రామా !

Published on Aug 2, 2019 10:45 pm IST

దర్శకుడు మహి వి రాఘవ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన ‘యాత్ర’ సక్సెస్ కావడంతో.. మహి వి రాఘవ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే ఇటీవలే ఓ సందర్భంలో.. తానూ ‘యాత్ర 2’ను చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నానని మహి వి రాఘవ్ చెప్పడంతో అందరూ ఆయన తరువాత సినిమా అదే అనుకున్నారు.

కాగా తాజాగా మహి వి రాఘవ్ పీవీపీ బ్యానర్ లో ‘సిండికేట్’ అనే సినిమాను తియ్యబోతున్నాడని పీవీపీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు యాత్రకు ఎటువంటి సంబంధం లేదని.. ఇదొక పక్కా యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

అయితే యాత్ర 2 కోసం వైఎస్సార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రకటనతో వారికి నిరుత్సాహం తప్పేలా లేదు. పైగా జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర దగ్గర్నుండే యాత్ర 2 ఉంటుందని.. తమ అభిమాన నాయకుడి బయోపిక్ ను త్వరలోనే స్క్రీన్ మీద చూడొచ్చు అని.. జగన్ అభిమానులు సైతం యాత్ర 2 పై చాలానే ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి మహి వి రాఘవ్ మాత్రం సిండికేట్ అనే మూవీతో రాబోతున్నాడు.

సంబంధిత సమాచారం :