నవంబర్ నుండి మొదలుకానున్న యాక్షన్ డ్రామా !

Published on Aug 5, 2019 9:00 am IST

దర్శకుడు మహి వి రాఘవ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన ‘యాత్ర’ సక్సెస్ కావడంతో.. మహి వి రాఘవ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే మహి వి రాఘవ్ పీవీపీ బ్యానర్ లో ‘సిండికేట్’ అనే సినిమాను తియ్యబోతున్నాడని పీవీపీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఇటివలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా పక్కా యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమా నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే యాత్ర 2 కోసం వైఎస్సార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా అయ్యాకనైనా యాత్ర 2 ను మొదలు పెడతాడేమో చూడాలి. జగన్ అభిమానులు సైతం యాత్ర 2 పై చాలానే ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :