“సర్కారు వారి పాట” తర్వాత మహేష్ కు క్వశ్చన్ మార్క్?

“సర్కారు వారి పాట” తర్వాత మహేష్ కు క్వశ్చన్ మార్క్?

Published on Aug 27, 2020 12:06 AM IST

Mahesh Babu
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించున్న “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఇంకా లైన్ లో ఉండగానే మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సాలిడ్ కాంబో దర్శకుడు రాజమౌళితో కూడా ఓ చిత్రం ఉందని ఖరారు అయ్యిపోయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం మొదలు కావడానికి ముందు అయితే మహేష్ ఒకటి రెండు ఇతర ప్రాజెక్టులు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

కానీ ఎవరితో చేస్తారు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్నగా మారిందట. మహేష్ ను ఈ మధ్య కాలంలోనే పలువురు టాప్ దర్శకులు అప్రోచ్ అయ్యి లైన్స్ కూడా వినిపించారని టాక్ వినిపించింది. వారిలో ప్రశాంత్ నీల్, లోకేష్ కనగ్ రాజ్ అలాగే సందీప్ వంగ పేర్లు కూడా వినిపించాయి. కానీ మహేష్ ఎవరితో చేస్తారు అన్నది ఇంకా డిసైడ్ కాలేదు అన్నట్టు తెలుస్తుంది. దీనితో సర్కారు వారి పాట అనంతరం మహేష్ ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు