ప్రత్యేక ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ఇండస్ట్రీలో నాకొక స్థానాన్ని కల్పించే సినిమా ‘రారా కృష్ణయ్య’.
Published on Jul 3, 2014 7:41 pm IST

sandeep_kishan
చిన్న చిన్న సినిమాలతో తన టాలెంట్ నిరూపించుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో అందుకున్న విజయంతో ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరో ఐపోయాడు. సందీప్ కిషన్ హీరోగా చేసిన కొత్త సినిమా ‘రారా కృష్ణయ్య’. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. అలాగే ఈ సినిమా విశేషాలను కాసేపు మాతో పంచుకున్నాడు.. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ఇంకా విడుదలకి 24 గంటలు కూడా లేదు. ఎలా అఫీలవుతున్నారు?

స) నా పరంగా అయితే ఆసక్తిగానూ ఉన్నాను, అలాగే కాస్త నర్వస్ గా కూడా ఉన్నాను. నా సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అనేది చూడాలి. ఈ సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత వస్తుండడం వల్ల బాగా టెన్షన్ ఫీలవుతున్నాను. కానీ రారా కృష్ణయ్య సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక స్థానాన్ని కల్పిస్తుందని నమ్ముతున్నాను.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ‘రారా కృష్ణయ్య’ బాగా కామెడీ మిక్స్ చేసిన పర్ఫెక్ట్ లవ్ స్టొరీ. ఈ సినిమాలో నేను ‘రాముడు మంచి బాలుడు’ టైపు రోల్ చేసాను. నేను ఆకతాయిగా చేసిన పనివల్ల ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అనేదే కథ.

ప్రశ్న) ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు మిమ్మల్ని భయపెడుతున్నాయా?

స) నా వరకూ మాత్రం హిట్ అయ్యే ప్రోడక్ట్ మా చేతిలో ఉందని చాలా నమ్మకంగా ఉన్నాను. అలాగే సినిమా చూసిన ఆడియన్స్ అందరూ నవ్వుతూ బయటకి వస్తారని మాత్రం చెప్పగలను.

ప్రశ్న) జగపతిబాబుతో పనిచేయడం ఎలా ఉంది. ఆయన పాత్ర గురించి చెప్పండి?

స) ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయనతో పని చేయడం అనేది నా కల నిజమైనట్టే లెక్క.. ఇందులో నాకు బ్రదర్ గా కనిపిస్తాడు. జగపతి బాబు గారి పాత్ర ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. సినిమాలో ఆయనది కీలక పాత్ర కావడం వలన ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ చెప్పలేను.

ప్రశ్న) వరుసగా మీరు కొత్త దర్శకులతో ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా?

స) కొత్త దర్శకులు నా దగ్గరికి తీసుకొచ్చే సినిమాలు చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. ఉదాహరణకి – ఈ సినిమా డైరెక్టర్ మహేష్ బాబు మొదట నాకొక డిఫరెంట్ కథ చెప్పాడు అది నాకు నచ్చక వేరే కథ చెప్పమన్నాను. వెనక్కి వెళ్ళిన తను బాగా కష్టపడి ‘రారా కృష్ణయ్య’ స్క్రిప్ట్ తో వచ్చాడు. నచ్చింది, చేసేసాను. ఈ సినిమా నాకన్నా మహేష్ కోసం బాగా ఆడాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న) లిప్ లాక్ సీన్ వల్ల ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం కోసం ఈ లిప్ లాక్ లేకుండా సినిమాని ప్రేక్షకులకు ఇవ్వలేకపోయారా?

స) సెన్సార్ బోర్డ్ వారు ఆ లిప్ లాక్ లేకుండా అయితే ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. కానీ ఆ సీన్ ఈ సినిమాలో చాలా కీలకమైన సన్నివేశంలో వస్తుంది. అలాగే ఆ సీన్ కి చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అందుకే మేము ఆ సీన్ ఉండాలని ఫిక్స్ అయ్యాము.

ప్రశ్న) లిప్ లాక్ సీన్ ఎలా చేసారు, చేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడలేదా?

స) రెజీనా నేను మంచి ఫ్రెండ్స్. ఈ సీన్ ని ప్రొఫెషనల్ గా చేయాలనుకొని చేసేసాం. ముందుగా కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాం కానీ ఆ సీన్స్ లో ఉన్న ఎమోషన్ ని బట్టి చేసేసాం. ఆ సీన్ ప్రాముఖ్యత అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్రశ్న) సందీప్ – రెజీనా పేర్లు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. దాని గురించి కాస్త చెప్పండి?

స) ఓహ్ … తను నా బెస్ట్ ఫ్రెండ్. తను నాకు గత 4 సంవత్సరాలుగా తెలుసు. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్ గా మా మధ్య ఉన్న కెమిస్ట్రీని స్క్రీన్ మీదకి కూడా ట్రాన్స్ఫర్ చేసాం. ఈ సినిమాలో తను నన్ను కాస్త డామినేట్ చేసే పాత్ర చేస్తుంది. ఆ పాత్రని బాగా చేసింది.

ప్రశ్న) షోర్ ఇన్ ది సిటీ సినిమాతో మీకు బాలీవుడ్ లో బాగానే గుర్తింపు వచ్చింది. కానీ అక్కడ ఎందుకు సినిమాలు కంటిన్యూ చేయలేదు?

స) అవును. నాకు హిందీ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. త్వరలోనే మళ్ళీ ఓ హిందీ సినిమా చేస్తాను. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం టాలీవుడ్ పైనే ఉంది.

ప్రశ్న) డికె బోస్ సినిమాకి ఏమైంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

స) నిజంగా చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్ గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు. ప్రస్తుతం ఆ సినిమా కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందుల్లో ఉంది.

ప్రశ్న) ఇప్పుడు మీకు టాలీవుడ్ లో హీరోగా యంగ్ హీరోస్ గ్రూప్ లో కలిసిపోయారు. ఇప్పుడు ‘ప్రస్థానం’లో లాగా ఒక నెగటివ్ రోల్ వస్తే చేస్తారా?

స) ముందుగా స్టార్డం అనేది నన్ను ఇప్పటి వరకూ ఆపలేదు. నేను ఇప్పటికీ చిన్న చిన్న అవసరాలు, కోరికలు ఉన్న సందీప్ కిషనే.. ప్రస్థానం లాంటి సినిమా అయితే కచ్చితంగా నెగటివ్ రోల్స్ లో సినిమా చేస్తాను.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలు ఏమిటి?

స) ప్రస్తుతం ‘జోరు’ సినిమా కోసం క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. అది కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాను.

అంతటితో సందీప్ కిషన్ తో మా ఇంటర్వ్యూ ముగించి సినిమా విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాను. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా లైవ్ అప్డేట్స్ మరియు రివ్యూ కోసం మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook