బన్నీ సాంగ్ మరో సరికొత్త రికార్డు

Published on Feb 15, 2020 4:45 pm IST

ఈ ఏడాది సంక్రాంతి చిత్రంగా విడుదలైన అలవైకుంఠపురంలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రం 150కోట్ల రూపాయల షేర్ తో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది. హీరో అల్లు అర్జున్ డిఫరెంట్ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్ ఈ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టాయి. కాగా అల వైకుంఠపురంలో చిత్ర విజయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో అంశం థమన్ పాటలు.

అల వైకుంఠపురంలో సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. సామజవరగమనా సాంగ్ తో పాటు, రాములో రాములా, బుట్ట బొమ్మ సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. కాగా అల వైకుంఠపురంలో చిత్రం లోని రాములో రాములా సాంగ్ ఏకంగా 200 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించాయి.

సంబంధిత సమాచారం :