పాపులర్ హర్రర్ సినిమా ప్రాంఛైజీలో రాశీఖన్నా

Published on Jan 22, 2020 12:00 am IST

తమిళ పరిశ్రమలో హర్రర్ సినిమాలకు ఆదరణ ఎక్కువ. అందుకే హిట్టైన హర్రర్ చిత్రాలకు సీక్వెల్స్ తీస్తుంటారు ఆయా చిత్రాల దర్శకులు. ప్రస్తుతం సుందర్ సి ఇదే పనిలో ఉన్నారు. తన పాపులర్ ‘అరన్మనై’ ప్రాంఛైజీలో మూడవ భాగాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. మొదటి భాగంలో హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మీలను, రెండవ భాగంలో హన్సిక, త్రిష, పూనమ్ భజ్వాలను తీసుకున్న ఆయన మూడవ పార్ట్ కోసం రాశీఖన్నా, ఆండ్రియాలను తీసుకోనున్నారు.

ఇలా పాపులర్ హర్రర్ ప్రాంఛైజీలో భాగమవడం పట్ల రాశీఖన్నా చాలా హ్యాపీగా ఫీలవుతోంది. హర్రర్ జానర్లో సినిమా చేయడం తనకు ఇష్టమని, ఆ కోరిక ‘అరన్మనై 3’తో నెరవేరుతుండటం సంతోషంగా ఉందని అంటోంది. ఇకపోతే ఇందులో ఆర్య ప్రధాన పాత్రదారుడిగా నటించనున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

X
More