
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ ఈ మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే కాస్త మిక్సిడ్ టాక్ నే తెచ్చుకున్న ఈ భారీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాలిడ్ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది.
అలా నైజాం లో ఫస్ట్ డే 10.85 కోట్లతో ప్రభాస్ కెరీర్ లో ఒక బెస్ట్ ఓపెనింగ్ గా రాగా ఇప్పుడు రెండో రోజు వసూళ్లు వివరాలు తెలుస్తున్నాయి. మరి ఈ రెండో రోజుకి గాను 6 కోట్ల మేర షేర్ రాధే శ్యామ్ రాబట్టినట్టు తెలుస్తుంది. దీనితో రెండు రోజులకి కలిపి ఈ చిత్రం 16.85 కోట్ల షేర్ ని అందుకుని మంచి నంబర్స్ ని నమోదు చేసిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు సంగీతం అందివ్వగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.