ప్రభాస్, పూజా క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టిస్తారట.

Published on Jul 13, 2020 12:00 am IST

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ జులై 10న విడుదల చేశారు. ప్రభాస్ మరియు పూజా హెగ్డే తో కూడిన రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ ఆసక్తి రేపింది. కాగా ఈ మూవీ క్లైమాక్స్ బరువైన ఎమోషన్స్ తో దర్శకుడు డిజైన్ చేశాడని తెలుస్తుంది. ఘాడ ప్రేమికుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, ప్రేక్షకుల చేత కంట నీరు పెట్టినడం ఖాయం అని తెలుస్తుంది.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల కాలం నాటి పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇక కథలో అధిక భాగం ఇటలీ దేశంలో జరుగుతుందని సమాచారం. నాలుగు భాషలలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More