విక్రమాదిత్య ఎవరో తెలుసా..? ప్రభాస్ “రాధే శ్యామ్” టీజర్ కి ముహూర్తం ఖరారు!

Published on Oct 20, 2021 10:17 am IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూ వీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పలు బాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

రాధే శ్యామ్ టీమ్ టీజర్ విడుదల కి తాజాగా ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. ఈ చిత్రం టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు అయిన అక్టోబర్ 23 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 23 వ తేదీన ఉదయం 11:16 గంటలకు టీజర్ విడుదల కానుంది. అంతేకాక ఒక మిస్టీరియస్ ప్రశ్న గా విక్రమాదిత్య ఎవరో తెలుసా అంటూ రాధే శ్యామ్ చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో వెల్లడించడం జరిగింది. ఎవరో తెలియాలంటే, రాధే శ్యామ్ టీజర్ ను చూడండి అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక టీజర్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభాస్ బర్త్ డే ను గ్లోబల్ ప్రభాస్ డే అంటూ సరికొత్త హ్యశ్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రేరణ పాత్రలో పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More