“రాధే శ్యామ్” నుంచి అప్డేట్ వచ్చేది అప్పుడేనా.?

Published on Jul 18, 2021 4:30 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్”. ఆల్రెడీ షూట్ కంప్లీట్ కాబడిన ఈ చిత్రం మళ్ళీ రీషూట్ నిమిత్తం హైదరాబాద్ లో తుది మెరుగులు దిద్దుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి ఏదొక అప్డేట్ అట్లీస్ట్ చిన్న పాటి అప్డేట్ అయినా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

అయితే దానిపై బజ్ అలా ఊరిస్తూనే ఉంది కానీ ఎప్పుడు వస్తుందో ఏ అప్డేట్ వస్తుందో అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ ప్రకారం ఈ చిత్రం నుంచి బహుశా వచ్చే ఆగష్టు నెల నుంచి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ టాక్ ఎంత వరకు నిజం కానుందో చూడాలి. మరి ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :