“రాధే శ్యామ్” నార్త్ రైట్స్ భారీ ధరకు.!

Published on Apr 30, 2021 12:00 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భయారే బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. అయితే ఈ చిత్రం షూట్ నిమిత్తమో ఏమో కానీ నిన్న చాలా స్లిమ్ లుక్ లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రభాస్ దర్శనం ఇచ్చాడు.

మరి ఇదిలా ఉండగా ఈ సమయంలోనే రాధే శ్యామ్ బిజినెస్ కు సంబంధించి కూడా పలు ఆసక్తికర గాసిప్పులే వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఓవర్సీస్ బిజినెస్ పై కూడా బజ్ బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా రాధే శ్యామ్ హిందీ థియేట్రికల్ హక్కులకు సంబంధించి బజ్ వినిపిస్తుంది.

ప్రభాస్ గత భారీ యాక్షన్ చిత్రం “సాహో” హక్కులు సొంతం చేసుకున్న టి సిరీస్ వారే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు కూడా భారీ మొత్తంలోనే చెల్లించినట్టు తెలుస్తుంది. ఫిగర్ అయితే బయటకు రాలేదు కానీ దగ్గరదగ్గర సాహో కి లానే ఉండొచ్చని తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :