ఇప్పుడు సేఫ్ లాకర్ లో ఉన్నది “రాధే శ్యామ్” మాత్రమేనా.!

Published on Aug 15, 2021 8:46 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “రాధే శ్యామ్” కూడా ఒకటి. ఆల్రెడీ షూట్ అంతా కంప్లీట్ అయ్యిపోయి రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. అయితే ఈ విషయం ఇలా ఉంచితే ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఒకింత సేఫ్ గా లాకర్ ఉన్నది ఏ సినిమా అని అంటే ఇదే అని చెప్పాలి. ప్రస్తుతం చూసుకున్నట్టయతే మన టాలీవుడ్ లో ఉన్న ఇతర స్టార్ హీరోల ప్రస్తుత అన్ని సినిమా నుంచి లీక్స్ బయటకి వచ్చేస్తున్నాయి.

ఇవి ఏ కారణం చేత వస్తున్నాయో కానీ మొన్న సర్కారు వారి పాట బ్లాస్టర్ నుంచి మొన్న పుష్ప సాంగ్ నిన్న పవన్ సినిమా సినిమా ఫోటోలు బయటకి వచ్చేసాయి.. ఇలా ఆల్ మోస్ట్ అందరి సినిమాలవి వచ్చేసినా రాధే శ్యామ్ నుంచి మాత్రం చిన్న లీక్ కూడా రాలేదు. దీనిని బట్టి ప్రొడక్షన్ హౌస్ వారు రాధే శ్యామ్ విషయంలో ఎంత కేర్ గా ఉన్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి దీనితో ప్రస్తుతం మన టాలీవుడ్ లో సేఫ్ లాకర్ లో ఉన్నది ఈ సినిమా మాత్రమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :