ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన నటుడు నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “రాధేశ్యామ్” అప్డేట్ కోసం ఈ కొత్త సంవత్సర వేడుకల్లో నిమగ్నం అయ్యి ఉన్నారు. మరి ఆ బిగ్ డే రానే వస్తుంది అన్నట్టుగా దర్శకుడు రాధా కృష్ణ కూడా పొద్దున్నే హింట్ ఇచ్చారు.
దీనితో రెబల్స్ మోస్ట్ అవైటెడ్ రాధే శ్యామ్ టీజర్ కోసం ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఇది ఎప్పుడు వస్తుందా అని టాక్ లో లేటెస్ట్ గా ఓ మాట వినిపిస్తుంది. ఈ టీజర్ ను సంక్రాంతి కానుకగా వదలనున్నట్టు లేటెస్ట్ టాక్ అంటే జనవరి 14న ఈ టీజర్ ను దాదాపు ఖాయం అన్నట్టుగా తెలుస్తుంది.
ఈ టైం లోనే అన్నట్టు గట్టి టాక్ వినిపిస్తున్న టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక భారీ చిత్రంలో పూజా హీరోయిన్ గా నటించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ స్వచ్ఛమైన ప్రేమ కావ్యాన్ని నిర్మించారు.


