‘రాధే శ్యామ్’.. పెద్ద కన్ఫ్యూజన్లో పెట్టేశారు

Published on Oct 21, 2020 11:10 pm IST


ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధే శ్యామ్’ మీద ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్టే గ్రాండ్ లెవల్లో హీరో హీరోయిన్ల పోస్టర్స్ రిలీజ్ చేశారు. అవి బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈరోజు వదిలిన ప్రభాస్ పోస్టర్ విశేషంగా క్లిక్ అయింది. అయితే ఈరోజు అప్డేట్ పెద్ద గందరగోళాన్ని కూడ సృష్టించింది. పోస్టర్లో హీరో పేరు ‘విక్రమాదిత్య’ అని రివీల్ చేశారు. అక్కడే కన్ఫ్యూజన్ మొదలైంది. అలాగే కొన్నిరోజుల క్రితం పూజా హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అందులో ఆమె పేరును ‘ప్రేరణ’ అని తెలిపారు.

మరి ప్రభాస్ విక్రమాదిత్య, పూజా హెగ్డే ప్రేరణ అయినప్పుడు టైటిల్ ‘రాధే శ్యామ్’లో వినబడుతున్న రాధ, శ్యామ్ ఎవరు. టైటిల్ జడ్జిమెంట్ ప్రకారం ప్రభాస్ పేరు శ్యామ్, పూజా పేరు ‘రాధ’ కదా అయ్యుండాలి. అంటే సినిమాలో వేరే అతి ముఖ్యమైన పాత్రలేమైనా ఉన్నాయా, వాటి పేర్లు ‘రాధ, శ్యామ్’ అయ్యుంటాయా. అవి ప్రభాస్, పూజాల కంటే ముఖ్యమైన పాత్రలా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి టైటిల్ వెనుక జస్టిఫికేషన్ ఏంటో టీజర్ లేదా ట్రైలర్ విడుదలైతే తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే యేడాది విడుదల చేయనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More