బోల్డ్ వీడియో పై రాధికా ఆప్టే వివరణ !

Published on May 22, 2021 7:05 pm IST

హీరోయిన్ రాధికా ఆప్టే.. ఆ మధ్య ఓ బోల్డ్ వీడియోతో సంచలనం అయిపోయింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించడం.. పైగా ఆమెను డీసెంట్ లుక్స్ లో తెలుగు దర్శకులు చూపించడంతో ఆమె పై ఒక ఇమేజ్ క్రియేట్ అయింది తెలుగు వాళ్లకు. అలాంటి డీసెంట్ హీరోయిన్ నుండి బోల్డ్ గెటప్స్ చూసే సరికి అందరూ షాక్ అయ్యారు. అయితే ఆ వీడియోకి సంబంధించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే వివరణ ఇచ్చింది.

రాధికా ఆప్టే మాట్లాడుతూ.. ‘నటిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని నేను ఎంతో సాహసం చేసాను. అందులో భాగంగా 2015లో ‘పార్చ్‌డ్‌’ సినిమాలో నేను నటించాను. కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నేను నటిస్తేనే నా పాత్రకు న్యాయం జరుగుతుంది. అందుకే అలాంటి బోల్డ్ సీన్స్ లో కనిపించాను. కానీ ఆ అశ్లీల సన్నివేశాలు లీక్‌ అయి వైరల్ అయ్యాయి. ఆ సమయంలో నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుతూ నా పై ఎన్నో విమర్శలు చేశారు. నాలుగు రోజులు నేను ఇంటి గడప కూడా దాటలేదు. అంతగా బాధ పడ్డాను. అయితే ఆ సినిమాలో నటించినందుకు నాకు ఆనందంగానే ఉంది. కానీ ఆ సినిమాకి మంచి పేరు వచ్చి ఉంటే బాగుండేది’ అంటూ రాధిక చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :