సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా రానున్న ‘పైసా పరమాత్మ’ మోషన్‌ పోస్టర్‌ విడుదల !

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా రానున్న ‘పైసా పరమాత్మ’ మోషన్‌ పోస్టర్‌ విడుదల !

Published on Aug 7, 2018 2:59 PM IST

Paisa Paramatma

విజయ్‌ కిరణ్‌ దర్శకుడిగా నూతన నటీనటులు సంకేత్‌, ఆరోహి, అనూష ప్రధాన పాత్రలుగా లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై విజయ్‌ జగత్‌ నిర్మిస్తోన్న డిఫరెంట్‌ కథా చిత్రం ‘పైసా పరమాత్మ’. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని బోనాల పండుగ సందర్బంగా ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి చేతుల మీదగా విడుదల చేసారు.

ఈ సందర్బంగా రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ – ‘ఈ సినిమా టైటిల్‌ చాలా ఇంప్రెస్‌గా వుంది. ఇలాంటి టాలెంట్‌ వున్న వారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌గా తీస్తే ఆడియెన్స్‌ ఆదరిస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్‌ అయి దర్శకుడిగా విజయ్‌ కిరణ్‌కి మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు విజయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ – ‘ ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న ఓ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతలు అనుకోకుండా ఓ ప్రాబ్లమ్‌లో ఇరుక్కొంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లమ్‌ నుండి బయట పడ్డారా లేదా? అనేది ఈ చిత్ర కథాంశం. కంటెంట్‌ని నమ్మి ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తప్పకుండా ‘పైసా పరమాత్మ’ చిత్రం ఆడియెన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని కలిగిస్తుందని చెప్పారు.

సంగీత దర్శకుడు కనిష్క మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయి. ప్రతి పాట సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లుగా వుంటుంది. ఇప్పటి వరకూ రాని ఓ కొత్త పాయింట్‌తో విజయ్‌ కిరణ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుంది అని తెలిపారు.

ఈ చిత్రానికి కథ: హరికిరణ్‌, సంగీతం: కనిష్క, కెమెరా: జి.యల్‌.బాబు, ఎడిటింగ్‌: అనిల్‌ జల్లు, మాటలు: రాకేష్‌ రెడ్డి, స్క్రీన్‌ ప్లే – దర్శకత్వం: విజయ్‌ కిరణ్‌, నిర్మాత: విజయ్‌ జగత్‌.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు