హీరోగా రాబోతున్న ప్రముఖ నిర్మాత కుమారుడు !

Published on Oct 7, 2018 2:30 am IST

రాజ్ కందుకూరి ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఓ స్థానం కల్పించుకున్నారు. కాగా తాజాగా ఆయన తనయుడు శివ కందుకూరి కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్నారని గతంలోనే సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శివ కందుకూరి ఎంట్రీ దాదాపు ఖాయం అయినట్లేనని తెలుస్తోంది.

కాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శివ‌రాజ్ క‌నుమూరి చెప్పిన కథ రాజ్ కందుకూరికి బాగా నచ్చిందట. ఈ కథతో తన కుమారుడ్ని తెలుగు తెరకు పరిచయం చేస్తే.. బాగుంటుందని రాజ్ కందుకూరి భావిస్తోన్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పై వెళ్లనుందని సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :