నితిన్ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ కొత్త మూవీ .

Published on May 22, 2019 10:06 pm IST

రాజ్ తరుణ్ విజయాల పరంగా ఒకింత వెనుకబట్టారనే చెప్పాలి. ఈ యంగ్ హీరో ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో “ఇద్దరి లోకం ఒకటే” అనే రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడంట. దీనితో పాటు నితిన్ కి “గుండె జారీ గల్లంతయ్యిందే” వంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ తో మరో మూవీ చేయనున్నాడట.

మొదట ఈ కథను నితిన్ కి వినిపించగా ఆయన నుండి ఎటువంటి సిగ్నల్ రాకపోవడంతో విజయ్ కుమార్ తరుణ్ కి వినిపించగా ఆయన ఓకే చేసారంట. తనకంటే వయసులో పెద్దదైన యువతిని ప్రేమించే యువకునిగా రాజ్ తరుణ్ పాత్ర ఉంటుందని సమాచారం. రాజ్ తరుణ్ దిల్ రాజు మూవీ “ఇద్దరి లోకం ఒకటే” పూర్తైన తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుంది.

సంబంధిత సమాచారం :

More