త్వరలోనే తన కొత్త సినిమా ను ప్రకటిస్తానంటున్న యువ హీరో !

Published on Dec 6, 2018 9:36 am IST


ఈ ఏడాది జూలై లో ‘లవర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యువ హీరో రాజ్ తరుణ్. ఇక ఇటీవల వరుస పరాజయాలతో నేపథ్యంలో ఈ సినిమా ఎలాగైనా తనకు సక్సెస్ ను అందిస్తుందని ఆశపడ్డాడు కానీ ఈ చిత్రంతో కూడా ఆయన ఆశలు నెరవేరలేదు. ఇక ఈచిత్రం తరువాత దాదాపుగా 5 నెలలు కావొస్తున్న ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు రాజ్ తరుణ్. అయితే తాజాగా ఆయన కొత్త సినిమా ఫై క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాది జనవరిలో తన కొత్త చిత్రాన్ని ప్రకటిస్తానని అలాగే ఒక కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ట్విట్టర్ లో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చాడు. మరి ఈ చిత్రం తోనైనా రాజ్ తరుణ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చుడాలి.

సంబంధిత సమాచారం :