నానితో పండుగను షేర్ చేసుకోనున్న రాజ్ తరుణ్

Published on Feb 16, 2020 9:00 pm IST

నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ‘వి’ చిత్రం మార్చ్ 25వ తేదీన విడుదలకానుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అంచనాల్ని బట్టి ఓపెనింగ్స్ కూడా బలంగానే ఉండనున్నాయి. మార్చ్ 25న ఉగాది కావడంతో పండుగ రోజు వసూళ్లకు అనుకూలంగా ఉంటుందని ఈ తేదీని నిర్ణయించారు.

అయితే ఇదే రోజున యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదలకానుంది. కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేశారు. పండుగ కావడం, వేరే పెద్ద సినిమాలేవీ 25వ తేదీనాడు విడుదలకు సిద్దంగా లేకపోవడంతో పండుగ అడ్వాంటేజ్ ను ఈ ఇద్దరు హీరోలు చక్కగా షేర్ చేసుకునే వీలుంది. ఇక టాక్ బాగుంటే వీకెండ్ వరకు చిత్రాలు మంచి రన్ దక్కించుకోవచ్చు కూడ.

సంబంధిత సమాచారం :

X
More