రాజ్ తరుణ్ సినిమాకి మరొక ఛాన్స్ దొరికింది

Published on Dec 5, 2020 12:00 am IST

థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చిన నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు సినిమా హాళ్లు తెరవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ డిసెంబర్ 25 నుండి సినిమా హాళ్లు ఓపెన్ కానున్నాయి. దీంతో ఎగ్జిబిటర్లు ఏయే సినిమాలను రిలీజ్ చేయాలో చూసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎక్కువ కొత్త సినిమాలేవీ విడుదలకు రెడీగా లేకపోవడంతో కొన్ని పాత సినిమాలను రీరిలీజ్ చేయనున్నారు. ఓటీటీల్లో వచ్చిన సినిమాలు కూడ ఈ జాబితాలో ఉన్నాయి.

వాటిలో రాజ్ తరుణ్ చేసిన ‘ఒరేయ్ బుజ్జిగా..’ సినిమా కూడ ఉంది. ఈ సినిమా అక్టోబర్ 1 న ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. అప్పట్లో సినిమాకు పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దీంతో టీమ్ కొంత నిరుత్సాహానికి గురైంది. ఇప్పుడు ఇదే సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. జనవరి 1న సినిమా విడుదలకానుంది. ఈ రీరిలీజ్ తో సినిమాకు ప్రేక్షకులను మెప్పించడానికి మరొక అవకాశం దొరికినట్టైంది. మరి ఈ రెండో అవకాశంలో అయినా ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఆకట్టుకోగలదేమో చూడాలి. కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ కొండా డైరెక్ట్ చేయగా ఇందులో మాళవికా నాయర్ కథనాయకిగా నటించారు.

సంబంధిత సమాచారం :

More