సెన్సార్ పూర్తి చేసుకున్న “రాజ రాజ చోర”..!

Published on Aug 14, 2021 10:00 pm IST

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో శ్రీ విష్ణు హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాశ్, సునైన నటిస్తుండగా, మై విలేజ్ ఫేమ్ గంగవ్వ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 19న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ని తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం :