డిసెంబర్ డేంజర్ తప్పించుకున్న ‘రాజా సాబ్’

డిసెంబర్ డేంజర్ తప్పించుకున్న ‘రాజా సాబ్’

Published on Dec 26, 2025 2:00 AM IST

రాజాసాబ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా సాబ్’ చిత్రం వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ధురంధర్’ చిత్రంతో పోటీ ఎందుకుని, పంపిణీదారుల విజ్ఞప్తి మేరకు మేకర్స్ తమ సినిమాను సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రస్తుతం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ దేశంలోనే అతిపెద్ద హిట్ గా నిలవడంతో, ‘రాజా సాబ్’ ఆ పోటీ నుంచి తప్పుకోవడం ఒక రకంగా మేలు జరిగిందనే చెప్పాలి.

ఒకవేళ ‘రాజా సాబ్’ డిసెంబర్ 5నే విడుదలై ఉంటే, ‘ధురంధర్’ ప్రభంజనం వల్ల వసూళ్లపై ఖచ్చితంగా ప్రభావం పడేది. టాక్ ఎలా ఉన్నప్పటికీ, భారీ చిత్రాల మధ్య పోటీ కలెక్షన్లను దెబ్బతీస్తుంది. ఇప్పుడు సోలో రిలీజ్ మరియు సంక్రాంతి సీజన్ అందుబాటులో ఉండటంతో ప్రభాస్ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ “లక్కీ ఎస్కేప్” తర్వాత చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రమోషన్లపై పూర్తి దృష్టి సారించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 27న గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ హారర్ కామెడీ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 27న జరిగే ఈవెంట్‌తో సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు