‘గడ్డం గ్యాంగ్’తో ప్రయోగం చేస్తున్న రాజశేఖర్ – జీవిత

‘గడ్డం గ్యాంగ్’తో ప్రయోగం చేస్తున్న రాజశేఖర్ – జీవిత

Published on Oct 26, 2014 8:10 PM IST

Gaddam-Gang
యాంగ్రీ యంగ్ మాన్ గా యాక్షన్ – డ్రామా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నడా. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గడ్డం గ్యాంగ్’. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సూదు కవ్వం’ సినిమా రీమేక్. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజశేఖర్ తన కెరీర్లో చేస్తున్న ప్రయోగాత్మక సినిమా అని ఆయన సతీమణి మరియు ఈ చిత్ర నిర్మాత జీవిత రాజశేఖర్ అంటోంది.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘ తెలుగులో వస్తున్న మొట్ట మొదటి డార్క్ కామెడీ సినిమా ‘గడ్డం గ్యాంగ్’. తనకు టచ్ లేని ఇలాంటి సినిమాతో రాజశేఖర్ ప్రయోగం చేస్తున్నాడు. గతంలో రాజశేఖర్ ఎప్పుడూ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చెయ్యలేదు. ఈ మూవీలో తనని చాలా కొత్తగా చూస్తారు. ఓవరాల్ గా గడ్డం గ్యాంగ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే బాగుంటుందని’ అన్నారు.

రాజశేఖర్ సరసన షీన హీరోయిన్ నటిస్తోంది. జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సంతోష్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అచ్చు ఈ సినిమాకి మ్యూజిక్ అందించడమే కాకుండా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

తాజా వార్తలు