“రాజా విక్రమార్క” నుండి విడుదలైన సరికొత్త పోస్టర్..!

Published on Jul 21, 2021 11:31 am IST

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, తాజాగా చిత్ర యూనిట్ మరొక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అందరికీ ఈద్ ముబారక్ అంటూ చెప్పుకొచ్చింది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రం లో కార్తికేయ ఎన్. ఐ ఎ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదల అయిన పోస్టర్ సినిమా పై మరింత అంచనాలను పెంచేసింది.

అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శ్రీ సరిపాల్లి గతం లో నువ్వు తోపు రా, అల్లుడు శ్రీను, నాయక్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ చిత్రం లో తన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆది రెడ్డి టి సమర్పణ లో 88 రమా రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :