ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘రాజా విక్రమార్క’ !

Published on Nov 1, 2021 5:38 pm IST

యంగ్ హీరో కార్తికేయ హీరోగా దర్శకుడు శ్రీ సారిపల్లి తెరకెక్కిస్తోన్న సినిమా ‘రాజా విక్రమార్క’. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హీరో నాని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌ గా కార్తికేయ కనిపించాడు. ట్రైలర్ లో ముఖ్యంగా కామెడీ, ట్విస్ట్‌లతో పాటు కార్తికేయ నటన, లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తికేయని ఉద్దేశించి ‘వీడిది బలుపు కాదు దూల’ అని తనికెళ్ల భరణి ,‘దీపావళి.. గ్రాండ్‌గా ప్లాన్‌ చేశావ్‌’ అంటూ కార్తికేయ బాగానే అలరించారు.

రమణ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విక్రమ్‌, ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఏజెంట్‌. చిన్నప్పుడు కృష్ణ సినిమాలు, పెద్దయ్యాక టామ్‌క్రూజ్‌ చిత్రాలు చూసి ఆవేశంతో ఎన్‌ఐఏలో చేరాడు. కొన్నాళ్ళకి తన సరదా తీరిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అతను ఆ జాబ్‌లో కొనసాగాడా? వదిలేశాడా? అసలు విక్రమ్‌ కథేంటి? అనేది మెయిన్ సినిమా.

ట్రైలర్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More