‘బాహుబలి’ ప్రీక్వెల్ కు దర్శకులు దొరికారు !

‘బాహుబలి’ ప్రీక్వెల్ కు దర్శకులు దొరికారు !

Published on Jul 4, 2018 6:08 PM IST

Rajamouli Deva Katta
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి-1, 2’ చిత్రాల విజయం ఏ స్థాయిదో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకు ప్రీక్వెల్ నిర్మించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రీక్వెల్ వెబ్ సిరీస్ రూపంలో ఉంటుందట. దీనికి సుమారు రూ.350 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారట.

మొత్తం మూడు సీజన్లుగా ఉండనున్న ఈ సిరీస్ ను రాజమౌళి, దేవ కట్టలు డైరెక్ట్ చేయనున్నారు. బాహుబలి కథలో రమ్యకృష్ణ ధరించిన శివగామి పాత్ర నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉండనుంది. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.7 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారట. మరి ఈ సిరీస్ ఎప్పటి నుండి మొదలవుతుంది, ఎవరెవరు ఇందులో నటిస్తున్నారు వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

తాజా వార్తలు