దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘బాహుబలి’ విషయంలో అన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సినిమాను అన్ని విధాలుగా ది బెస్ట్ సినిమాగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తాజాగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం రాజమౌళి షియోల్ వెళ్ళారు. అక్కడ కొందరు చైనా, కొరియన్ దేశాల నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
రాజమౌళితో పాటు బాహుబలి వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మే 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


