
తెలుగు చలన చిత్ర సీమతో పాటు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎంతో గర్వించదగ్గ విధంగా హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతగానో చూస్తున్నారు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గత రెండున్నర ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఓ విజువల్ వండర్ గా మలిచిన ‘బాహుబలి’ మొదటి పార్ట్ ‘బాహుబలి – ది బిగెనింగ్’ సెన్సార్ కూడా పూర్తి చేసుకొని జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం రాజమౌళి చెన్నైలో బాహుబలి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
బాహుబలి సినిమా సెకండ్ పార్ట్ పై వస్తున్న రూమర్స్ కి రాజమౌళి తెరదించాడు. చల్ రోజుల నుంచి బాహుబలి పార్ట్ 2 లో సూర్య కనిపిస్తాడని అంటున్నారు. కానీ సూర్య ఎలాంటి పాత్ర చేయడం లేదని రాజమౌళి తెలిపాడు. అలాగే ఇప్పటి వరకూ 30-40% సెకండ్ పార్ట్ కి సంబందించిన షూటింగ్ పూర్తయ్యిందని తెలిపాడు. బాహుబలి మొదటి పార్ట్ హంగామా అంతా అయిపోయాక బాహుబలి సెకండ్ పార్ట్ షూట్ మొదలవుతుంది. ప్రభాస్, తమన్నా, రానా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

