జపాన్లో రాజమౌళి కీలక అప్డేట్స్..మహేష్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జపాన్లో రాజమౌళి కీలక అప్డేట్స్..మహేష్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 19, 2024 8:02 AM IST


ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎదురు చూస్తున్న మరో అవైటెడ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు(MaheshBabu) అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) ల కాంబినేషన్ లో రానున్న గ్లోబ్ ట్రాటింగ్ సినిమా (SSMB29) అని చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో ఏ చిన్న బజ్ వచ్చినా సెన్సేషన్ గా మారుతుండగా ఇపుడు ఈ చిత్రంపై స్వయంగా జక్కన్న రాజమౌళినే క్రేజీ అప్డేట్ అందించారు.

జపాన్ లో తన లాస్ట్ గ్లోబల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” (RRR Movie) స్క్రీనింగ్ కి హాజరైన తాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా తాలూకా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది అని అలాగే అది ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని ఇక సినిమా క్యాస్టింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కేవలం హీరో ఒక్కరే లాక్ అయ్యారు. అతడే మహేష్ బాబు అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు.

అంతే కాకుండా ఈ సినిమా హీరో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు మీలో చాలా మందికే తెలిసే ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తామని జక్కన్న సూపర్ అప్డేట్స్ అయితే సూపర్ ఫ్యాన్స్ కి అందించారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు