టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా హీరోలుగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ కి షోల్డర్ సర్జరీ అవడం వల్ల బాహుబలి టీం షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చారు.
దాంతో రాజమౌళి ఈ ఖాళీ సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో గడుపుతున్నాడు. ప్రస్తుతం ఎడిటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ మూవీ మరియు గ్రాఫిక్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా షూటింగ్ తో పాటు జరుగుతున్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. బాహుబలి సినిమా రెండు పార్ట్స్ గా 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


