రభస ఫస్ట్ లుక్ ని మెచ్చుకున్న రాజమౌళి

Published on May 20, 2014 4:30 am IST

rajamouli
యంగ్ టైగర్ ఎన్.టి. ఆర్ నటించిన ‘రభస’ ఫస్ట్ లుక్ ఆయన పుట్టినరోజు రేపు కావడంతో ఆ సందర్భంగా రభస సినిమా ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేసారు. ఈ ఫోటోలకి, పోస్టర్ లకి అద్బుతమైన స్పందన వస్తుంది. ఈ పవర్ఫుల్ పోస్టర్ లను రాజమౌళి అభినందించారు.
.
“ఎన్.టి.ఆర్ ని ఇటువంటి పోస్టర్లలో చూసి చాలా రోజులవుతుంది” అని ఫేస్ బుక్ లో పెట్టారు. వీరిద్దరూ కలిసి పలు బ్లాక్ బస్టర్లలో కలిసి పనిచేసారు కాబట్టి రాజమౌళికి ఎన్.టి.ఆర్ పాజిటీవ్స్ బాగా తెలుసు

ఈ సినిమాలో సమంత మరియు ప్రణీత మన నందమూరి హీరో సరసన నటిస్తున్నారు. కందిరీగ శ్రీనివాస్ దర్శకుడు. ఎన్.టి.ఆర్ ని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశ కు చేరుకుంది. ఈ ఏడాది ఆగష్టు 14న ఈ సినిమా విడుదలకానుంది

సంబంధిత సమాచారం :