హాలీవుడ్ మీడియాతో చరణ్ ఇంట్రో పై కూడా రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Apr 9, 2022 9:36 pm IST

రీసెంట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యిన చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇద్దరు స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాలో భారీ హంగులతో పాటు ఇద్దరు కూడా సాలిడ్ పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టి ప్రపంచ వ్యాప్తంగా అటెన్షన్ ని తెచ్చుకోగలిగారు.

అయితే లేటెస్ట్ గా దర్శకుడు రాజమౌళి ఓ హాలీవుడ్ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ మంచి ఆసక్తిగా మారాయి. మొదటగా ఎన్టీఆర్ నటన పై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ కాగా అందులోనే మళ్ళీ చరణ్ పై చేసిన కామెంట్స్ కూడా ఆసక్తిగా మారాయి.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామ రాజు ఎంట్రీ కి సినిమా చూసిన వారు అంతా కూడా ఫిదా అయ్యోపోయారు. మరి ఈ సీన్ పైనే తాను మాట్లాడుతూ ఈ సినిమా ఆ ఇంట్రో సీక్వెన్స్ ఒక పీసెస్ పీసెస్ లా ఉంటుంది అందులో అంతమంది జనంతో ఒక అలలా ఉంటుంది.

అలాంటి దానిలో రామ రాజు పై నుంచి దూకి కేవలం ఒక్కడిని తీసుకు రావాల్సి ఉంటుంది. అది నేను ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది అని ముందు ఈ రేంజ్ లో వస్తుంది అనుకోలేదని రాజమౌళి రామరాజు ఇంట్రోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సంబంధిత సమాచారం :