ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ లుక్ ఫస్ట్ ?

Published on Feb 12, 2020 9:01 am IST

ఆర్ ఆర్ ఆర్ అభిమానులను రాజమౌళి విడుదల తేదీ వాయిదా వేసి ఒకింత నిరాశ పరిచాడు. ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది జులై 30న విడుదల అవుతుంది అనుకుంటున్న తరుణంలో ఏకంగా వచ్చే ఏడాది జనవరికి వాయిదాపడటం ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ జరగకపోవడమే విడుదల ఆలస్యం కావడానికి కారణం అని తెలుస్తుంది. ఇక మూవీ విడుదల వాయిదా పడినా, ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ లుక్స్ మరియు ట్రైలర్స్, టీజర్స్ తో అలరించనున్నాడు జక్కన్న.

ఐతే ఎన్టీఆర్ కంటే ముందు చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా రాజమౌళి పరిచయం చేసే అవకాశం కలదు. కారణం రాజమౌళి వీరి పుట్టిన రోజులు కానుకగా ఫస్ట్ లుక్స్ విడుదల చేయాలని భావిస్తున్నాడట, ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టిన తేదీ మే 20కాగా, చరణ్ బర్డ్ డే మార్చ్ 27 కాబట్టి…ఎన్టీఆర్ కంటే ముందు చరణ్ ని అల్లూరిగా రాజమౌళి పరిచయం చేసే అవకాశం కలదు. ఆర్ ఆర్ ఆర్ విడుదల 2021లో కావడంతో మార్చిలోనే ఫస్ట్ లుక్ విడుదల ఎందుకని భావించే అవకాశం కూడా కలదు. చూద్దాం మరి రాజమౌళి ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎప్పుడు, ఎలా పరిచయం చేస్తారో?

సంబంధిత సమాచారం :