“RRR” ప్రమోషన్స్ కి మరో లెవెల్ ప్లాన్స్.?

“RRR” ప్రమోషన్స్ కి మరో లెవెల్ ప్లాన్స్.?

Published on Jul 21, 2021 11:00 AM IST

మామూలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తన సినిమాలకి ఏ లెవెల్ ప్లానింగ్స్ చేస్తారో తెలిసిందే. మరి వాటికి తగ్గట్టు గానే సాలిడ్ ప్రమోషన్స్ తో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తారు. అలా తన లాస్ట్ సినిమాలు “బాహుబలి 1”, “బాహుబలి 2” లకి అన్ని భాషల్లో కూడా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసి పెద్ద విజయాలనే అందుకున్నారు.

మరి ఇప్పుడు కూడా అంతకు మించిన ప్లాన్ లనే తన కొత్త చిత్రం “RRR” కి వేస్తున్నట్టు తెలుస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఎలాగో పూర్తయ్యిపోతున్నందున మరోపక్క శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా రాజమౌళి బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ప్రమోషన్స్ పరంగా పలు ఆసక్తికర విషయాలే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా ఆల్బమ్స్ కోసం ప్రముఖ బాలీవుడ్ కంపోజర్ అమిత్ త్రివేది కూడా వర్క్ చెయ్యగా ఇప్పుడు సౌత్ సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ తో ఒక సాలిడ్ ప్రమోషనల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ సాంగ్ ని రెండు భారీ సెట్స్ లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఈరోజు జాయిన్ అయ్యిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా అందుకోసమే అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం జక్కన్న “RRR” కి కూడా ప్రమోషన్స్ హోరెత్తించనున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు