ఈ రంగంలో కూడా అడుగుపెట్టనున్న రాజమౌళి..!

Published on Jul 10, 2020 1:45 am IST


ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా దీనితో పాటు ఈ లాక్ డౌన్ సమయంలో సూపర్ స్టార్ మహేష్ తో ఎలాంటి సినిమాను తీయాలి అన్న విషయం పై స్క్రిప్ట్ పనిలో పడి కసరత్తులు కూడా చేస్తున్నారని టాక్ వినిపించింది.

ఇప్పుడు రాజమౌళి సినిమాలతో పాటుగా మరో రంగం వైపు కూడా ఆసక్తి కనబరుస్తున్నారని ఇప్పుడు లేటెస్ట్ గాసిప్ వినిపిస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఓటీటీ కంటెంట్ ఎంత పాపులర్ అయ్యిందో చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు కూడా ఈ రంగంలో కూడా ఒక స్టెప్ వేసారు.

అలా రాజమౌళి కూడా ఓ ప్లాన్ వేస్తున్నారట. మంచి కంటెంట్ మరియు ఆలోచనలు ఉన్న యువతను స్ట్రీమింగ్ రంగంకు పరిచయం చేసేందుకు రాజమౌళి తన వంతు సహకారం అందించాలని అనుకుంటున్నారట. మరి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More