ఆ హీరో దొరకడం మా అదృష్టం- రాజమౌళి

Published on Mar 29, 2020 1:02 pm IST

రాజమౌళి బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ పై ప్రశంశలు కురిపించారు. వర్క్ పట్ల ఆయనకున్న డెడికేషన్ మరియు కమిట్మెంట్ ని ఆయన కొనియాడడం జరిగింది. బాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆయన ఒకసారి కార్వాన్ నుండి బయటికి వస్తే షాట్ ఓకే అయ్యేవరకు లోపలికి వెళ్ళరు అన్నారు. ఓ రోజు షాట్ పూర్తి కావడానికి చాల ఆలస్యం అయ్యింది. అయినప్పటికీ పూర్తయ్యేవరకు సెట్స్ లో ఉండి వెళ్లారు. ఆ రోజు కేవలం లంచ్ మాత్రమే చేసి, మాకోసం అంత సమయం కేటాయించారు అన్నారు.

అలాగే అలాంటి స్టార్ మాకు దొరకడం అదృష్టం అని అన్నారు. రాజమౌళి కి అజయ్ దేవ్ గణ్ కి ఎప్పటినుండో అనుభందం ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ మూవీ హిందీలో మక్కీ పేరుతో విడుదల కాగా ఈ చిత్రానికి అజయ్ దేవ్ గణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. హిందీలో ఆర్ ఆర్ ఆర్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అజయ్ దేవ్ గణ్ కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More