టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఎలాంటి ప్రచారం లేకుండా నిర్వహించారు.
ఇక వరుస షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎప్పుడెప్పుడు అఫీషియల్‌గా ప్రకటన చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో SSMB29 మూవీపై దర్శకుడు రాజమౌళి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.
జక్కన్న తన సినిమాలను ప్రారంభించక ముందే ప్రెస్ మీట్ పెడుతుంటాడు. కానీ, ఇప్పుడు సినిమా ప్రారంభమైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో ఈ ప్రెస్ మీట్ ఉంటుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి చూపులు రాజమౌళి పెట్టబోయే ఈ ప్రెస్ మీట్‌పై పడింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా నటిస్తుంది.