తన డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఉన్న సమస్యని చెప్పిన రాజమౌళి

తన డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఉన్న సమస్యని చెప్పిన రాజమౌళి

Published on Oct 19, 2015 10:10 PM IST

rajmouli-director
‘బాహుబలి’ అనే సినిమా రాకముందు వరకూ సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గానే దర్శకధీరుదు ఎస్ఎస్ రాజమౌళికి పేరుంది. కానీ ఈ ఏడాది వచ్చిన బాహుబలి సినేమాతి నేషనల్ వైడ్ గానీ కాకుండా, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా గుర్తింపు వచ్చింది. ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ రికార్డ్ ని సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం హాలీవుడ్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇది పక్కనే పెడితే ఎప్పటి నుంచో రాజమౌళి చెప్పుకుంటూ వస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంని సినిమాగా తీయడం. తను ఏ సినిమా చేసిన ఆ సినిమాని చేయడం కోసం వేసే ఒక్కో స్టెప్ గా భావిస్తానని చెప్తుంటాడు.

ఇటీవలే మద్రాసు ఐఐటి విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మరియు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఉన్న ఇబ్బందులను గురించి చెప్పాడు. ‘మహాభారతం ని సినిమా తీయాలనేది నా కల. ఒకవేళ అన్నీ కలిసొచ్చి ఆ సినిమాని తీయడానికి ఫిక్స్ అయితే నాలుగు పార్ట్స్ గా సినిమాని తీస్తాను. ఆ సినిమా మొత్తం పూర్తవ్వాలి అంటే 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సినిమా చేయడానికి ఉన్న అసలు సిసలైన సమస్య నటీనటులు దొరకడమే..ఎందుకంటే ఆ సినిమా కోసం 6 ఏళ్ళు సమయం కేటాయించే హీరోలు కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని రోజులు కాల్షీట్స్ ఇచ్చే హీరోలు ఎక్కడ ఉన్నారు చెప్పండి అంటూ ఐఐటి విద్యార్థులకే ప్రశ్నని వదిలారు’ రాజమౌళి. మరి రాజమౌళి ఓపెన్ గా చెప్పిన ఈ కామెంట్ పై టాలీవుడ్ హీరోస్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు