రాజమౌళి మనసు మహేష్ మూవీ పైకి మళ్లిందట.

Published on Jul 8, 2020 8:52 pm IST

ఎట్టి పరిస్థితులలోనైనా ఆర్ ఆర్ ఆర్ త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి గట్టి పట్టుదలతో ఉన్నారు. కానీ కరోనా ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. అనుమతుల అనంతరం అన్నీ ఏర్పాటు చేసుకున్నా, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా వేచి చూడక తప్పడం లేదు. ఇక హైద్రాబాదులో కరోనా విలయ తాండవం చేస్తుండగా, షూటింగ్ కి ఎవరైనా ససేమిరా అంటున్నారు. దీనితో మరి కొన్నాళ్లు జక్కన్న వేచి చూడక తప్పదు.

కాగా ఈ గ్యాప్ లో రాజమౌళి మహేష్ మూవీ పనులు చూద్దాం అని ఫిక్స్ అయ్యారట. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి కథా చర్చలు మొదలుపెట్టారట. మహేష్ ఇమేజ్ కి సరిపోయేలా ఓ మంచి స్టోరీ లైన్ ఎంపిక చేసే పనిలో ఉన్నారట రాజమౌళి. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ తో తన మూవీ ఉంటుందని రాజమౌలి తెలియజేసిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క మహేష్ ఫ్యాన్స్ తమ హీరో కోసం రాజమౌళి ఎలాంటి కథ సిద్ధం చేయనున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More