బాలీవుడ్ హీరోకు థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి!

rajamouli-siddharth
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ముంబైలో తన సినిమా ‘బాహుబలి 2’కి సంబంధించిన ఫస్ట్‌లుక్ రిలీజ్‌తో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఫస్ట్‌లుక్, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ రాజమౌళి టీమ్ ఇప్పుడు ముంబైలో ఉంది. ఇక ఈ సందర్భంగానే రాజమౌళి కుమార్తె ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కలిశారట. సిద్ధార్థ్‌కు పెద్ద ఫ్యాన్ అయిన రాజమౌళి కుమార్తె ఆయనను కలవాలని ఎప్పట్నుంచో కోరగా రాజమౌళి నేడు ఆ ఏర్పాట్లు చేశారట.

ఇక తన కూతురుని కలిసినందుకు థ్యాంక్స్ అని, తనిప్పుడు చాలా సంతోషంగా ఉందని, మీరిచ్చిన సలహాలు కూడా మాకు బాగా ఉపకరిస్తాయని తెలుపుతూ సిద్ధార్థ మల్హోత్రాకు రాజమౌళి థ్యాంక్స్ తెలిపారు. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాలో ఓ సెన్సేషన్‌గా మారిపోయిన రాజమౌళి, ఇప్పుడు బాహుబలి 2ను అందుకు ఎన్నో రెట్లు మించేలా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో విడుదల కానున్న సినిమాకు ఇప్పట్నుంచే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.