సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దగ్గర మగధీర, మర్యాద రామన్న, ఈగ లాంటి సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’. ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సూపర్ పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి మరోసారి జంటగా నటించిన ఈ సినిమాని మయుఖ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని నిన్న సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గ్రాండ్ గా లాంచ్ చేసారు.
ఈ వేడుకకి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేసాడు. అంతే కాకుండా యంగ్ హీరోస్ అయినా నాని, అల్లరి నరేష్, నవదీప్ లతో పాటు మంచు లక్ష్మీ ముఖ్య అతిధిగా హాజరైంది. ఈ లాల్ ఆడియో ని రిలీజ్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ ‘జగదీశ్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి, బాగా కష్టపడి పనిచేసాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని’ తెలిపాడు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించాడు. జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్నేష్ బాబులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి ఈశ్వర్ ఎల్లుమహంతి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.


