ఆర్ఆర్ఆర్ లో ఆ సన్నివేశాలన్నీ…,చివరికి నెట్టేశారా?

Published on Nov 18, 2019 7:19 am IST

అనుకున్న సమయానికి ఆర్ఆర్ఆర్ మూవీని ఎలాగైనా విడుదల చేయాలన్న సంకల్పంతో రాజమౌళి నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారు.ఈమూవీ చిత్రీకరణ ప్రారంభం నుండి అనేకమార్లు బ్రేక్స్ పడుతూవచ్చాయి. ఇద్దరు హీరోలు గాయాలపాలు కావడం, రాజమౌళి కుమారుడి పెళ్లి, బాహుబలి మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కొరకు రాజమౌళి లండన్ వెళ్లడం ఇలా అనేక కారణాలతో అనుకున్న ప్రకారం షూటింగ్ జరగలేదు. దీనితో హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో రాత్రి పగలు షూటింగ్ జరుపుతున్నారని సమాచారం.

ఐతే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఇంతవరకు ఎన్టీఆర్ కొరకు హీరోయిన్ ఫైనల్ కాలేదు. కథలో భాగంగా ఓ విదేశీ హీరోయిన్ ని ఎన్టీఆర్ కి జంటగా తెచ్చేపనిలో ఉన్నారు రాజమౌళి.గతంలో ఎడ్గర్ డైసీ అనే ఓ బ్రిటిష్ నటిని ఫైనల్ చేయగా, ఆమె తర్వాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీనితో ఎన్టీఆర్ హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ చివర్లో షూట్ చేయాలని జక్కన్న ఆలోచనట.చరణ్ కి హీరోయిన్ గా అలియా భట్ నటిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఇప్పటికే కొన్ని చిత్రీకరించారు. పాటల చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. కాబట్టి ఎన్టీఆర్ మరియు హీరోయిన్ కాంబినేషన్ లో వచ్చే ఆటపాటల షూటింగ్ జక్కన్న చివరికి నెట్టేశారని సమాచారం.

సంబంధిత సమాచారం :

More