మగధీర టు ఆర్ఆర్ఆర్ చరణ్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Mar 30, 2020 10:38 am IST

తాజా అప్డేట్స్ తరువాత ఆర్ ఆర్ ఆర్ మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. రాజమౌళి మరో విజువల్ వండర్ అందించనున్నాడని భీమ్ ఫర్ రామరాజు వీడియో ద్వారా అర్థం అవుతుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా దాదాపు 9నెలల సమయం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ హీరోలలో ఒకరైన చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి మాట్లాడుతూ.. చరణ్‌తో పనిచేసి పదేళ్లకు పైనే అవుతుంది. రామ్ చరణ్ కెరీర్ ప్రారంభ సమయంలో తనలో నేను ఓ రానెస్ చూశాను.ఆ క్వాలిటీ నాకు మగధీరలో సినిమా కొరకు బాగా ఉపయోగపడింది. ఇక ఇన్నేళ్లలో చరణ్ నటుడిగా చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఎంతో పరిణితిని సాధించాడు. రంగస్థలంతో నటుడిగా ఉన్నత స్థాయికి చేరాడు. చరణ్ నటనను ఆస్వాదిస్తున్నాడు” అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో 2009లో చరణ్ రెండవ సినిమాగా వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

సంబంధిత సమాచారం :

X
More